నంద్యాల జిల్లా బనగానపల్లెలో ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలోని 2వ బ్లాక్లో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమావేశమయ్యారు. యాగంటి ఆలయానికి, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే భక్తులకు అన్ని విధాలు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ఆవశ్యకతపై మంత్రులు చర్చించారు.