శ్రీ సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్ళపల్లి లో గురువారం రాత్రి 7 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా శ్రీరాములు అనే శివ భక్తుడు ని ఢీకొన్న కారు. శ్రీరాములకు తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నదని అత్యవసరం విభాగం వైద్యులు డాక్టర్ కార్తీక్ రెడ్డి తెలిపారు.