ఇబ్రహీంపట్నం: బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడిని చంపి మూసి నదిలో పడేసిన తండ్రి, బాలుడి కోసం గాలిస్తున్న డిఆర్ఎఫ్ సిబ్బంది
బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల కుమారుడిని ఒక తండ్రి చంపి సంచిలో మూట కట్టి మూసి నదిలో పడేసిన విషయం తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బండ్లగూడలోని సూర్య నగర్‌కు చెందిన అక్బర్ సనా బేగం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఆనస్కు అనారోగ్యం కారణంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో కుమారుడికి ఊపిరాడకుండా తండ్రి చేసి సంచిలో కట్టి మూసి నదిలో పడేసాడు. బాలుడి మృతదేహం కోసం డిఆర్ఎఫ్ సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం గాలించారు.