20 మంది పాత నేరస్తుల బైండోవర్
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పాత నేరస్తులుగా ఉన్న 20 మందిని కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం తహసిల్దార్ మురళి ఎదుట బైండోవర్ చేశారు. అదేవిధంగా పట్టణ పోలీస్ స్టేషన్లో వారికి సిఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. నేరాల్లో పాల్గొంటే పీడీ యాక్ట్ ప్రకారం జైలుకు పంపుతామని వారిని హెచ్చరించారు. నేరాలకు స్వస్తి పలికి సత్ప్రవర్తనతో మెలగాలన్నారు.