జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు: ఎంపీ పుట్టా మహేష్ కుమార్
Eluru Urban, Eluru | Sep 26, 2025
ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి గెయిల్ సంస్థ కార్పొరేట్ సామజిక బాధ్యతలో భాగంగా అందించిన కోటి రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలను ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) లు శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ పేదప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారని, అందుకు తగిన విధంగా వైద్య సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేసి ప్రభుత్వ ఆసుపత్రుల ప్రతిష్ట పెంచాలన్నారు.