జగిత్యాల: జిల్లా కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతి కార్యక్రమం, పాల్గొణి నివాళులర్పించిన బిసి కమిషన్ చైర్మన్ జి.నిరంజన్
బుధవారం 11-30 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో శిల్పకళ, వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ తోపాటుగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ లు బిఎస్ లత, బి. రాజా గౌడ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ మాట్లాడుతూ.. విశ్వకర్మ జయంతి అనేది కళలు, శిల్పకళ, మరియు వాస్తుశిల్పానికి ప్రతీక అన్నారు.నేటి ఆధునిక ప్రపంచంలో, ఇంజనీర్లు, యంత్రాల రూపకర్తలు, స