శ్రీకాకుళం: వాస్తు శాస్త్రం శిల్పకలకు అధిపతి అయిన విశ్వకర్మ భారత సంస్కృతి కళలకు ఆదిగురువు: జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
వాస్తు శాస్త్రం, శిల్పకళలకు అధిపతి అయిన విశ్వకర్మ భారతీయ సంస్కృతిలో కళలు, చేతివృత్తులు, నిర్మాణాలకు ఆదిగురువని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ హాజరయ్యారు.ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి శుభ సందర్భంలో ఆయుధాలు, పనిముట్లతో పాటు యంత్రాలకు కూడా పూజలు చేసే సంప్రదాయం ఉందన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న జరుపుకునే ఈ పండుగను ముఖ్యంగా శిల్పులు, వడ్రంగులు, కమ్మర్లు, స్వర్ణకారులు ఘనంగా జరుపుకుంటారు.