ప్రకాశం జిల్లా టంగుటూరులోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి స్థానిక ఎస్సై నాగమల్లేశ్వరరావు లారీ డ్రైవర్లకు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిద్ర మత్తులో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాలలో లారీలు ఎదుర్కొని నిద్రించి తర్వాత సురక్షితంగా తమ ప్రాంతాలకు చేరుకోవాలని లారీ డ్రైవర్లకు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు సూచించారు. చల్లటి నీటితో లారీ డ్రైవర్లకు మొహం కడిగించి ఫేస్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.