జమ్మలమడుగు: ముద్దనూరు : మండలంలో పలు పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలం రాజు గురువాయ పల్లె, కే తిమ్మాపురం గ్రామాల్లో రబీలో సాగుచేసిన శనగ,ప్రొద్దుతిరుగుడు, కంది,మొక్కజొన్న పంటలను గురువారం డాట్ సెంటర్ సమన్వయ కర్త,డాక్టర్ క్రిష్ణ ప్రియ, వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ పెథాలజీ శాస్త్రవేత్త డాక్టర్ వి.మాధురి, సైన్స్ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సి. యాస్మిన్, ముద్దనూరు మండల వ్యవసాయ అధికారి వెంకట క్రిష్ణారెడ్డి తో కలిసి పలు పంటలను పరిశీలించారు.ఈ సంధర్భంగా శాస్త్రవేత్త మాధురి మాట్లాడుతూ రైతులు శనగ పంటలో నీరు నిలబడకుండా చూసుకోవాలని సూచించారు.