కర్నూలు: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేయండి : ఓల్డ్ సిటీ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు సి. నాగరాజు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని సిఐటియు ఆధ్వర్యంలో జోహారాపురం లో కార్మికులు నిరసన చేపట్టారు. ఓల్డ్ సిటీ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు సి. నాగరాజు మాట్లాడుతూ — కార్మికుల పోరాట ఫలితంగా ఏర్పడిన సంక్షేమ బోర్డును తరువాతి ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని, కార్మికుల చెస్ నిధులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఏడాదిన్నర గడిచినా సంక్షేమ బోర్డు పునరుద్ధరణపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.భవన నిర్మాణ సామగ్రి ధరలు తగ్గించాలని, స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ