భూపాలపల్లి: బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా చేయాలి: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
రానున్న బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, ఉత్సవాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశించారు. ఈరోజు సోమవారం భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ లో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... ముఖ్యంగా అన్ని గ్రామాల్లో, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సుందరంగా చూపరులను ఆకట్టుకునేలా