ఇబ్రహీంపట్నం: క్రీడలు వ్యక్తిలో సృజనాత్మకత క్రమశిక్షణ సమయపాలనను పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్ లో సయ్యద్ అసాద్ ముక్తార్ అలీ ఆధ్వర్యంలో వాలీబాల్ అర్చివ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని పోటీలను శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు వ్యక్తిలో సృజనాత్మకత క్రమశిక్షణ సమయపాలనను పెంపొందిస్తాయని గెలుపోటములను సమానంగా స్వీకరించడం ద్వారా జీవిత పాఠాలు నేర్చుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.