చంద్రగిరిలో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది మద్యం మత్తులో భర్త వెంకటేష్ తన భార్య హరిత పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు హరిత తీవ్ర గాయాలతో కేకలు వేస్తుండగా స్థానికులు గమనించి వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి రుయా ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.