లాడ్జిలో పేకాట.. పక్కా సమాచారంతో దాడులు చేసిన చిన్న బజారు పోలీసులు
నెల్లూరు పొగతోటలోని ఓ లాడ్జ్ లో పేకాట ఆడుతున్న 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో చిన్న బజారు పోలీసులు దాడులు నిర్వహించి.. ప్రముఖ బుకీ కృష్ణ సింగ్ తో పాటు మరో 14 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 లక్షల 20 వేలు నగదు సీజ్ చేసినట్లు సిఐ కోటేశ్వరరావు శనివారం సాయంత్రం 5 గంటలకు మీడియాకు తెలిపారు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు