అథ్లెటిక్స్ లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన టి.చదివే వాండ్ల పల్లి జడ్పి హైస్కూల్ విద్యార్థిని ఈ.హాసిని
అథ్లెటిక్స్ జాతీయ స్థాయి పోటీలకు టి.చదివే వాండ్ల పల్లి జడ్పి హైస్కూల్ విద్యార్థిని ఈ.హాసిని ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ రెడ్డిమోహన్ రెడ్డి బుధవారం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ లో గల టి.చదివేవాండ్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని ఈ హాసిని పాల్గొని వంద మీటర్ల పరుగు పందెంలో విజయం సాధించి జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన హాసిని ని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు