కే.వి.పల్లి పోలీస్ స్టేషన్లో ఘనంగా దసరా వేడుకలు
కే.వి.పల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం ఎస్ఐ వి.చిన్న రెడ్డప్ప ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్టేషన్ ఆవరణం పూలతో అలంకరించి, దీపాలు వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా స్టేషన్ లోని ఆయుధాలకు, వాహనాలకు పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్టేషన్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు దేవి ఆలంకరణలతో అలరించారు. పూజా కార్యక్రమాలు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.దసరా సాంప్రదాయాలు, ప్రాముఖ్యత, విలువలు గురించి ఎస్ఐ చిన్న రెడ్డప్ప తెలిపారు.