భీమవరం: ఫిర్యాదుదారులతో క్షేత్రస్థాయిలో చర్చించి సమస్యలు పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్
ఫిర్యాదుదారులతో క్షేత్రస్థాయిలో చర్చించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి. సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 219 అర్జీలు అందాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపించాలని ఆయన సూచించారు. శాఖల వారీగా అర్జీలను పరిశీలించి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలన్నారు