కుప్పం: కూర్మాపల్లిలో విషాదం, ఏనుగుల దాడిలో రైతు మృతి
కుప్పం మండల పరిధిలోని కుర్మానీపల్లిలో ఏనుగుల దాడిలో రైతు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మృతుడు అదే గ్రామానికి చెందిన కిట్టప్పగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఏనుగులు సంచరిస్తుండడంతో పరిసరాల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.