కరీంనగర్: కరీంనగర్ బస్టాండ్ ఎదుట సర్వీస్ రిమూవ్ అయిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి అపస్మారక స్థితిలో మృతి
కరీంనగర్ పట్టణములోని బస్టాండ్ ఎదుట మాజీ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందాడు. మంగళవారం ఉదయం అందజా 8గంటల సమయంలో స్థానిక ఆటో డ్రైవర్ లు చూసి 108 అంబులెన్స్ సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని సిబ్బంది అపస్మారక స్థితిలో శ్రీనివాస్ రెడ్డిని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సంఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తము కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు వన్ టౌన్ పోలీసులు.