ఇబ్రహీంపట్నం: షాద్ నగర్ లో త్వరలోనే 100 పడకల ఆసుపత్రి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
రంగారెడ్డి జిల్లా:షాద్ నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో స్వస్థ నారి స్వస్తిక్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం ప్రారంభించారు. ఆసుపత్రిలో ఉన్న రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించారు. త్వరలోనే వంద పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.