భువనగిరి: త్రిబుల్ ఆర్ బాధితులకు అండగా సిపిఎం పోరాటం చేస్తుంది: సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా: త్రిబుల్ ఆర్ బాధితులకు న్యాయం జరిగే విధంగా వారికి అండగా పోరాటం చేస్తామని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య బుధవారం అన్నారు.ఈ సందర్భంగా సంస్థ నారాయణపురం మండలం శేరిగూడెం పుట్టపాక గ్రామాలలోని బాధ్యత రైతులను కలిశారు. అనంతరం మండల కేంద్రంలో అమరవీల స్మారక భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్ల దూరంలో నిర్మించాల్సిన త్రిబుల్ ఆర్ రోడ్డు ను చౌటుప్పలోని దివిస్ కంపెనీ కోసం 28 కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు అలాట్మెంట్ కుదించడం సరికాదన్నారు.