కొండపి: పొన్నలూరు మండలంలో పర్యటించిన ఏపీ మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, జాలర్ల సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడి
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో సోమవారం ఏపీ మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పర్యటించారు. ఇటీవల తుఫాను కారణంగా నష్టపోయిన జాలర్లకు ప్రభుత్వం నుంచి సహాయం అందాల చూస్తామని ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక పంపించినట్లు వెల్లడించారు. అనంతరం పొన్నలూరు మండలంలోని సంగమేశ్వర శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో దామచర్ల సత్య పాల్గొని అర్చకులు అందించిన తీర్థప్రసాదాలు స్వీకరించారు. తర్వాత కమిటీ సభ్యులుఆయనను ఘనంగా సన్మానించారు.