జమ్మలమడుగు: కమలాపురం : పట్టణంలో స్వచ్ఛత హే సేవ కార్యక్రమంలో భాగంగా ముమ్మర పారిశుద్ధ్య చర్యలు
కడప జిల్లా కమలాపురం మున్సిపల్ కమిషనర్ ప్రహల్లాద ఆధ్వర్యంలో మంగళవారం స్వచ్ఛత హే సేవ 2025 కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ పనులు నిర్వహించారు. మాచిరెడ్డిపల్లి రోడ్డు లోని ప్రజల ఫిర్యాదు మేరకు అక్కడ రోడ్డుపై ప్రవహిస్తున్న మరుగునీరును శుభ్రం చేసి ప్రజల సమస్యను పరిష్కరించారు.అంతేగాక మురుగు కల్వర్టులను మరియు డివైడర్ దగ్గర ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి మరియు రోడ్డు సైడ్ ఉన్న ముళ్ళ పొదలను మున్సిపల్ కార్మికులతో కమలాపురం మున్సిపల్ కమిషనర్ ప్రహల్లాద దగ్గరుండి తొలగింప చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.