అనంతపురం నగర శివారులోని ట్రాన్స్పోర్ట్ కార్యాలయం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి చెందిన కదిరప్ప అనే వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.