సంతనూతలపాడు: నాగులుప్పపాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
ప్రకాశం జిల్లా నాగులుప్పపాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో పేకాట ఆడుతున్న 11 మందిని స్థానిక ఎస్సై రజియా సుల్తానా ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.46,330 నగదుల స్వాధీనం చేసుకున్నామని ఎస్సై మీడియాకు వెల్లడించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్ఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.