వర్షాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించిన సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ
వర్షాల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూళ్లూరుపేట సిఐ మురళీకృష్ణ సూచించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని తన కార్యాలయం నుండి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాళంగి నది, నెర్రి కాలువతో పాటు సూళ్లూరుపేట, తడ పరిసరాల్లోని చెరువులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయన్నారు. అలాగే మరో మూడు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నదులు, చెరువుల్లో చేపల వేటకు గాని, చిన్న పిల్లలు ఈతకు కాలువలు, చెరువుల వద్దకు వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యం అనేది ప్రాణాపాయం కావచ్చని హెచ్చరిస్తూ,