గుర్రంకొండ లో రైతులకు వేరుశనగ విత్తన కాయలు పంపిణీ
వేరుశనగ విత్తన కాయలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఓ వెంకటేశ్వర్లు మరియు టీడీపీ మండలాధ్యక్షులు నాయిని జగదీష్ అన్నారు. గుర్రంకొండ మండలం గుర్రంకొండ ఎంపిడిఓ కార్యాలయం నందు శుక్రవారం వేరుశనగ విత్తన కాయలు పంపిణీ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుర్రంకొండ మండలంలోనీ అన్ని గ్రామాల్లో విత్తన కాయలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. రైతు సేవ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులు విత్తనకాయలను పొందాలని కోరారు