జమ్మలమడుగు: కమలాపురం: పట్టణంలోని త్రాగునీటి పైప్ లైన్ లీకేజ్ సమస్యలు పరిష్కరించాలని స్థానికుల విన్నపం
కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలోని కడప రోడ్డులో ఓ మిషన్ దగ్గర త్రాగునీటి పైపు లీకేజీ అయ్యి10, రోజులు నుండి త్రాగు నీరు వృధాగా పోతున్నదని గురువారం స్థానిక ప్రజల ఆరోపిస్తున్నారు.కమలాపురం పట్టణంలో త్రాగునీరు ఏ సమయంలో వదులుతారో,ఏ సమయంలో కట్ చేస్తారో తెలియని అయోమయంలో ఉన్నామని స్థానికులు తెలిపారు. పట్టణంలో ఉన్న త్రాగునీటి పైప్ లీకేజీలపై స్థానిక మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ వహించి లీకేజీలను నివారించి పట్టణ ప్రజలకు సురక్షిత త్రాగు నీటిని అందించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.