అన్నపూర్ణాదేవిగా ద్వారకాతిరుమల క్షేత్రదేవత శ్రీకుంకుళ్లమ్మ అమ్మవారు దర్శనం
Eluru Urban, Eluru | Sep 24, 2025
సకల జీవరాసులకు ఆహారాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవిగా ద్వారకాతిరుమల క్షేత్రదేవత శ్రీకుంకుళ్లమ్మ అమ్మవారి అలంకరణ భక్తులను అలరించింది. దేవిశరన్నవరాత్రి వేడుకలలో భాగంగా మూడవరోజైన బుధవారం అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఒక చేతిలో అక్షయపాత్రను ఉంచుకొని మరో చేతిలో ఉన్న గరిటతో సాక్షాత్తు ఆ మహాశివునికి బిక్షం వేస్తున్నట్లు ఉన్న ఈ అలంకరణ భక్తులను పరవశింపజేసింది. అన్నపూర్ణ అలంకారంలో కొలువైన అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు జరుపుతున్నారు.