ఖమ్మం అర్బన్: విద్యారంగ సమస్యలపై కదం తొక్కిన విద్యార్థి లోకం
ప్రభుత్వం విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాలను తక్షణమే మంజూరు చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఖమ్మం పురవీధుల్లో విద్యార్థులు కదం తొక్కారు