పెనుకొండలో టీడీపీ నాయకులతో ఎంపీ బి.కె పార్థసారథి సమావేశం
శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. పట్టణంలోని మడకశిర రోడ్డులోని ఎంపీ కార్యాలయానికి వచ్చిన నాయకులు ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని స్థానిక సమస్యలపై ఎంపీ స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు.