గజపతినగరం: కొండతామరపల్లి జంక్షన్లో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి మృతి
గంట్యాడ మండలం కొండ తామరపల్లి జంక్షన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భీమవరం గిరిజన గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త కే రాజేశ్వరి మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. సెప్టెంబర్ 12న రాత్రి బైక్ పై స్వగ్రామానికి అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి వెళుతుండగా కొండ తామరపల్లి జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేశ్వరి మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.