తాడిపత్రి పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం కార్తీక ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామి నీలకంఠేశ్వర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నీలకంఠేశ్వర అలంకరణతో పాటు పలు రూపాల్లో రామలింగేశ్వర స్వామి దర్శనమిచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక అలంకరణలో ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.