తాడిపత్రి: నాకు చివరి దీపావళి అంటావా అంటూ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై విరుచుకుపడ్డ తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి
నాకు చివరి దీపావళి అంటావా అంటూ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జే సీ ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. తాడిపత్రిలో శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నన్ను ఉద్దేశించి ఇదే చివరి దీపావళి, రఫ్ఫా రఫ్ఫా ఆడిస్తానంటూ వ్యాఖ్యానించడం మంచిది కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపుతున్నాడు కాబట్టి ఊరకనే ఉన్నామన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి మరోసారి ఎమ్మెల్యే కాలేడన్నారు.