సంగారెడ్డి: సంగారెడ్డిలోని పోలీసు క్రైమ్ రికార్డ్ బ్రాంచ్ ను ఆకస్మికంగా తనిఖీ ఎస్పీ పారితోష్ పంకజ్
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలోని జిల్లా క్రైమ్ రికార్డ్ బ్రాంచ్‌ను ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో నమోదైన ప్రతి కేసును ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలని ఆయన సూచించారు. అలాగే, వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో డిసిఆర్బి డిఎస్పీ సురేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు