గాజులరామారంలో హైడ్రా కూల్చి వేసిన పేధుల ఇళ్ల శిథిలాలు, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కబ్జా చేసిన 11 ఎకరాల స్థలాన్ని పరిశీలించినట్లు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. హైడ్రా అనేది ప్రైవేటు ఏజెన్సీ ఇలా పని చేస్తూ మూసి వాటర్ ఒడ్డున పెద్ద నిర్మాణాలను విస్మరించి, కేవలం పేదల ఇళ్ల పైనే ప్రతాపం చూపుతోందన్నారు. పార్టీ మారిన గాంధీ కబ్జా చేసిన, అతనిపై చర్యలు తీసుకోకుండా, సీఎం రేవంత్ రెడ్డి పోలీసులతో భద్రత కల్పించారని ఆరోపించారు.