మొబలైజేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏ.ఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్) పోలీసు బలగాలకు శుక్రవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో మన్నీల ఫైరింగ్ రేంజ్ మైదానంలో ఫైరింగ్పై సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి ఆయుధాల వినియోగం, లక్ష్య సాధన, భద్రతా చర్యలపై ప్రాయోగిక శిక్షణ ఇచ్చారు. విధి నిర్వహణలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఈ ఫైరింగ్ సాధన ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.