కుల దురహంకార హత్యలు జిల్లాలో జరగకుండా ఉండాలంటే శ్రావణిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బండారు రవి అన్నారు. శనివారం ASF కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ప్రజా సంఘాల ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.. కుల దురహంకార హత్యలు జరగకుండా మండల,గ్రామాల్లో చైతన్య సదస్సులు పెట్టి, మూడ నమ్మకాలపై,మతపరమైన దాడులకు వెతిరేకంగా సదస్సులు పెట్టాలని డిమాండ్ చేశారు. శ్రావణి కుటుంబానికి తగిన న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.