రాయదుర్గం: పట్టణంలో మరోసారి మొరాయించిన 108 అంబులెన్స్ వాహనం, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు
రాయదుర్గం పట్టణంలో 108 అంబులెన్స్ వాహనానికి మరోసారి జబ్జుచేసింది. ఎన్నో రోజులుగా తరచూ మరమ్మతులకు గురవుతూ అటు సిబ్బందిని ఇటు రోగులను ఇబ్బంది పెడుతున్న ఆ వాహనం సోమవారం మద్యాహ్నం మరోసారి మొరాయించింది. ఇంజన్ స్టార్ట్ కాకపోవడంతో సిబ్బంది తోసుకుంటూ సెల్ఫ్ కొట్టేందుకు ప్రయత్నించారు. చివరకు మెకానిక్ ను తీసుకువచ్చి ప్రయత్నాలు చేసినా ఇంజన్ స్టార్ట్ కాలేదు. దీంతో సిబ్బందికి ఏం చేయాలో తోచక లక్ష్మీబజార్ రోడ్డు పక్కన ఆపేశారు. 108 పరిస్థితి ఇలా ఉంటే అత్యవసర సమయాల్లో రోగులకు సేవలు ఎలా అందుతాయంటూ ఈ దృశ్యాలు చూసిన వారు పెదవివిరచారు.