రామగుండం: సింగరేణి గనులపై బతుకమ్మ ఆటపాట., శరన్నవరాత్రుల అమ్మవారి ప్రత్యేక పూజలలో ఏఐటియుసి కార్మిక శ్రేణులు
బొగ్గు ఉత్పత్తిలో కీలకంగా ఉన్న సింగరేణి కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారికి ఏ ఐ టియుసి నాయకులు కార్మికులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా శుక్రవారం 11గనిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కార్మికులను కలిశారు అలాగే ఐదవ ఓసీపీలో కార్మిక శ్రేణులతో కలిసి బతుకమ్మ ఆటపాటను ఆడారు మన సాంప్రదాయంలో తెలంగాణ ఉట్టిపడేలా బతుకమ్మ ఆటలో గనులపై నిర్వహించడం చాలా సంతోషకరమైన అన్నారు శరన్నవరాత్రుల్లో అమ్మవారు కార్మికులను చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.