టేక్మల్: మండలంలో ఘనంగా మిలాద్ ఉన్ నబి వేడుకలు నిర్వహించిన ముస్లిం సోదరులు
Tekmal, Medak | Sep 14, 2025 మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం లోని టేక్మాల్ మండల కేంద్రంలో ఆదివారం నాడు ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచి గ్రామంలోని దర్గాల్లో ప్రత్యేక ప్రార్థన చేశారు.అనంతరం గ్రామాల పురవీధుల గుండా జెండాలతో నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మైనార్టీ రైట్స్ ప్రొటక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎంఎస్ సలీం యువకులు తదితరులు చిన్నారులు పాల్గొన్నారు.