మంత్రాలయం: కౌతాళం జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు తమకు వద్దు,ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలి: గ్రామ ప్రజల వినతి
కౌతాళం: మండల కేంద్రంలో జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు తమకు వద్దని ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలని లబ్ధిదారులు కోరారు. సింగిల్ విండో చైర్మన్ అల్లూరి వెంకటపతి రాజుతో కలిసి తహశీల్దార్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. గ్రామానికి 5కిలోమీటర్ల దూరంలో ఉన్న వంక ముంపు ప్రాంతంలో స్థలాలు ఇచ్చారని తెలిపారు. వాటికి బదులుగా గ్రామానికి దగ్గరలో నివాసాలకు అనువైన స్థలాలు ఇవ్వాలని కోరారు.