ప్రశాంతి నిలయంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్య సాయి సేవాదళ్ సభ్యులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సంగీత కచేరీ భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బుధవారం ఉదయం పలు రాష్ట్రాలకు చెందిన సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతిరోజూ ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సత్యసాయి ట్రస్టు సభ్యులు తెలిపారు.