నల్గొండ: మూసి ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం : ప్రాజెక్టు అధికారి మధు ఈ సంఘంలో
నల్లగొండ జిల్లా మూసి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి మధు సోమవారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపారు. మూసి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగడంతో ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,391.98 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందన్నారు .దీంతో అధికారులు నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 4,691.16 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 643.60 లకు చేరిందని ప్రాజెక్ట్ అధికారి మధు తెలిపారు