ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచే దిశగా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత శాఖ అధికారులు ఆదేశించారు బుధవారం నాడు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్ , పిజిఆర్ఎస్ ప్రత్యేక అధికారి ఉమామహేశ్వరి తదితర అధికారులు పాల్గొన్నారు