జమ్మలమడుగు: యామవరం : గ్రామంలో రైతులకు మినుము పంటపైన అవగాహన సమావేశం
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ముద్దనూరు మండలం యామవరం రైతు సేవా కేంద్రంలో శుక్రవారం రైతులకు మినుము పంట సాగు పైన డాట్ సెంటర్ కో ఆర్డినేటర్ క్రిష్ణ ప్రియ అవగాహన కల్పించినట్లు మండల వ్యవసాయ అధికారి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ సంధర్భంగా శాస్త్రవేత్త క్రిష్ణప్రియ మాట్లాడుతూ రైతులు పల్లాకు తెగులును తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలన్నారు. అలాగే విత్తన శుద్ధి విధానం తప్పకుండా పాటించాలన్నారు. రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు అధికముగా వాడాలని సూచించారు.