నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్ గ్రామంలో జెసిబి వాహనంలోని బ్యాటరీలు దొంగతనం ఇద్దరు నిందితుల అరెస్ట్: రూరల్ ఎస్సై
Nirmal, Nirmal | Sep 21, 2025 నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్ గ్రామంలో జెసిబి వాహనంలోని బ్యాటరీలు దొంగతనం ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి ఆదివారం తెలిపారు. గ్రామానికి చెందిన సాయన్న అనే వ్యక్తి జెసిబి వాహనాన్ని గ్రామ శివారులో పార్కింగ్ చేశాడు. శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మి వాడకు చెందిన నందకిషోర్, మంజులాపూర్ కు చెందిన అఖిల్ అనే ఇద్దరు నిందితులు బ్యాటరీలు ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.