చౌటుప్పల్: చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
యాదాద్రి భువనగిరి జిల్లా: దసరా సెలవులు ముగియడంతో సొంత ఊర్ల నుంచి ప్రజలు వాహనాదారులు తిరిగి నగరాలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా దీంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఎన్ హెచ్ 65 పై వాహనాల రద్దీ భారీగా కొనసాగుతుంది. చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారి కెక్కిరిసిపోయింది. కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జాం ఏర్పడింది దీనితో ప్రయాణికులు నెమ్మదిగా ప్రయాణం కొనసాగిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పోలీసులు చర్యలను చేపట్టారు.