సంగారెడ్డి: సంగారెడ్డిలో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధింపు కొరకు దీక్ష: మీడియాతో వివరాలు వెల్లడించిన బిసి జేఏసీ చైర్మన్ ప్రభు గౌడ్
నవంబర్ 11, 2025న సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ దీక్ష చేపట్టాలని చైర్మన్ ప్రభు గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ దీక్ష 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు నాంది కావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ రిజర్వేషన్లను ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని ప్రభు గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ శ్రీధర్, మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోకుల్ కృష్ణ, ఉన్నారు.