ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటూ మధురైకి చెందిన మహిళ గురువారం అతని ఇంటి ఎదురుగా నిరసనకు దిగింది. తమ నుంచి రూ.68 లక్షలు తీసుకొని, చెల్లించాల్సిన ఇన్స్టాల్మెంట్ చెల్లించడం లేదంటూ మధురై నుంచి వచ్చి నిరసన తెలిపింది. సదరు వ్యక్తి లేకపోవడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అనూక్ మాట్లాడి నిరసన విరమింపజేశారు.